మ్యానిఫెస్టో


ఎన్నికలో పోటీచేయడానికి బ్యాంక్ ను ఋణం అడిగాను. బ్యాంక్ వారు ఋణం ఇవ్వలేదు. భారతరాజ్యాంగం లోనే ఇది లేదు. ఎక్కడ ఈ రూల్ లేదు అని చెప్పారు 2014 ఎం.ఎల్.ఏ ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గంనుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసాను. 2015 వరంగల్ పార్లమెంట్ నుండి ఎం.పి.గా పోటీచేయడానికి వెళ్ళాను ఎన్నికలో పోటీచేయడానికి బ్యాంక్ ను ఋణం అడిగాను వారు ఋణం ఇవ్వలేదు బ్యాంకు వారు అప్పు ఇవ్వనందు వలన పోటీచేయలేక పోయాను, 2019 సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి మిత్రుల సహాయం తో ధరావత్తు కట్టి ఎం.పి.గా పోటీచేస్తున్నాను. నిన్నే నామినేషన్ పత్రాలు ధాఖలు చేసి వచ్చాను. 

ఎంపిగా నెగ్గితే సికిందరాబాద్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళబట్టి తిష్టవేసుకుని కూర్చున్న ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాను. యువతకు ఉపాధి, మహిళలు, వృద్దులకు ఆసరాతో పాటి సమాజంలోని అన్ని తరగతుల ప్రజల అభ్యుదయానికి కృషి చేస్తాను. సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాను. ఒకవేళ నెగ్గకపోయినా ప్రజాసేవ, సామాజిక ఉద్యమాలు, ప్రజాపోరాటాలు చేస్తూనే ఉంటాను. నిత్యం ప్రజల్లోనే ఉంటాను. నాలాంటివాళ్ళెందరో రాజకీయాల్లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.