నేను నిర్వహించిన ప్రజా ఉద్యమాలు


1. అప్కో స్కామ్ వెలికితీత ... వివరాలకు క్లిక్ చేయండి

2. డబుల్ బెడ్ రూం ఇళ్ళకొరకు పోరాటం ... వివరాలకు క్లిక్ చేయండి

3. దుర్గం చెరువును కాపాడాలని... వివరాలకు క్లిక్ చేయండి

4. ధర్నా చౌక్ తరలింపుకు వ్యతిరేకంగా ... వివరాలకు క్లిక్ చేయండి

5. ఎస్.ఎస్టీ. సబ్ ప్లాన్ లోపాలను సవరించాలని... వివరాలకు క్లిక్ చేయండి

6. పరిసరాల్లో చెత్త వేసేవారికి ఆలయప్రవేశ నిషేదం ఉండాలనికోరుతూ వినూత్న నిరసన... వివరాలకు క్లిక్ చేయండి

7. నకిలీ దృవపత్ర ఉద్యోగుల విషయంలో... వివరాలకు క్లిక్ చేయండి

8. బిచ్చగాళ్ళకు స్వైన్ ఫ్లూ మందుల, మాస్త్ ల పంపిణీ ... వివరాలకు క్లిక్ చేయండి

9. కె.సి.ఆర్ సచివాలయానికి రాకపోవడానికి వ్యతిరేకంగా ... వివరాలకు క్లిక్ చేయండి

10. హుస్సేన్ సాగర్ పరిశుబ్రతకోరుతూ... వివరాలకు క్లిక్ చేయండి

11. జంతువుల కొవ్వుతో నూనెల తయారీకి వ్యతిరేకంగా... వివరాలకు క్లిక్ చేయండి

12. పింఛను కోసం తిరుగుతూ మరిణించిన వృద్ధులకొరకై ... వివరాలకు క్లిక్ చేయండి

13. ప్రభుత్వభూముల కబ్జాలకు వ్యతిరేకంగా ... వివరాలకు క్లిక్ చేయండి

14. మాగీ న్యూడుల్స్ అమ్మకాలకి వ్యతిరేకంగా ... వివరాలకు క్లిక్ చేయండి

15. జి.హెం.ఎస్.స్.కుంబకోణం ... వివరాలకు క్లిక్ చేయండి

16. కాచీగూడ, ప్రతిమ హాస్పటల్స్ వవహారం పై... వివరాలకు క్లిక్ చేయండి

 

ప్రజా ఉద్యమాలు


గూడులేని పేదలకు గూడు కల్పించాలని 2014 ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాను. స్వచ్చభారత్ హుసేన్సాగర్లో స్వయంగా నీటిలో దిగి పూర్తిగా చెత్త పిచ్చి మొక్కలు తీసేసాను, రోడ్లపై చెత్త వేసినవారికి గుడిలో మసీదులో చర్చిలో ప్రవేశము చేయవద్దు అనే కార్యకమం చేశాను వితంతులకి, వృద్దులకు, ఫెంక్షన్లు దరఖాస్తులు పెట్టించాను, రాష్టపతి ప్రధాన మంత్రి వారికీ లేఖలు రాస్తుంటాను, ఫీజు నియంత్రణ చట్టం చేయాలనీ అంబెడ్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టాను, శంషాబాద్ జెర్ పల్లి లో కల్తీనూనెల అక్రమ రవాణా కొనసాగుంది దీనిపై HRC కోర్టులో కేసువేసి అధికారులకి ఫిర్యాదులు చేసి స్వయంగా నేనే వాదిస్తునాను స్వైన్ ఫ్లూ వ్యాధిపై అవగాహనా మరియు మందుల వితరణ చేశాను. యాచకులకి ఎక్కువగా పంపిణి చేశాను, నగరంలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటుచేయాలని అధికారులని కోరాను, రోడ్లు అద్వానంగా మారాయి గుంతహలను నేనే స్వయంగా పూడ్చాను. అధికారులకి ఫిర్యాదు చేశాను.  ఆహార పదార్థాల్లో కల్తీ నివారణకి కృషి చేస్తున్నాను. హోటళ్లు, తినుబండారాల విక్రేతలు నాణ్యతాప్రమాణాలు పాటించడంలో భాగంగా అనేక కార్యక్రమాలను చేపట్టాను. 
ప్రజల ఆరోగ్యాలతో తీవ్రంగా చెలగాటమాడుతున్న మరో సమస్య నగరంలో ఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా నిర్మిస్తున్న సెల్ ఫోను టవర్ల వల్ల వచ్చే రేడియేషను. దీనివల్ల ప్రజలు ఎన్నో యాతనలకు గురవుతున్నారు. ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్నారు. వీటి నియంత్రణ, పర్యవేక్షణ నామమాత్రంగా ఉండటం, ఎక్కడపడితే అక్కడ సెల్ టవర్ నిర్మాణాలకు అనుమతులిచ్చేయడం వల్ల సమస్య తీవ్రరూపం దాల్చింది. ఈ విషయంలో అలుపెరుగని పోరాటం చేస్తున్నాను. ముఖ్యంగా చిన్నపిల్లలు చదువుకునే స్కూళ్ళు, హాస్పిటళ్ళపై సెల్ టవర్ల నిర్మాణంపై అధికారులు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి వారిపై వత్తిడి చేయడం వల్ల ఆయా టవర్ల రేడియేషన్ కొలిపించి, ఆ టవర్లని అక్కడనుండి తొలగించేలా చేసాను. .

అప్పడిగితే ఇవ్వనన్నారు:
ఎన్నికలో పోటీచేయడానికి బ్యాంక్ ను ఋణం అడిగాను. బ్యాంక్ వారు ఋణం ఇవ్వలేదు. భారతరాజ్యాంగం లోనే ఇది లేదు. ఎక్కడ ఈ రూల్ లేదు అని చెప్పారు 2014 ఎం.ఎల్.ఏ ఎన్నికల్లో అంబర్పేట నియోజకవర్గంనుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసాను. 2015 వరంగల్ పార్లమెంట్ నుండి ఎం.పి.గా పోటీచేయడానికి వెళ్ళాను ఎన్నికలో పోటీచేయడానికి బ్యాంక్ ను ఋణం అడిగాను వారు ఋణం ఇవ్వలేదు బ్యాంకు వారు అప్పు ఇవ్వనందు వలన పోటీచేయలేక పోయాను, 2019 సికింద్రాబాద్ పార్లమెంట్ నుండి మిత్రుల సహాయం తో ధరావత్తు కట్టి ఎం.పి.గా పోటీచేస్తున్నాను. నిన్నే నామినేషన్ పత్రాలు ధాఖలు చేసి వచ్చాను. 

ఎంపిగా నెగ్గితే సికిందరాబాద్ నియోజకవర్గంలో ఎన్నో ఏళ్ళబట్టి తిష్టవేసుకుని కూర్చున్న ఎన్నో సమస్యలను పరిష్కరిస్తాను. యువతకు ఉపాధి, మహిళలు, వృద్దులకు ఆసరాతో పాటి సమాజంలోని అన్ని తరగతుల ప్రజల అభ్యుదయానికి కృషి చేస్తాను. సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాను. ఒకవేళ నెగ్గకపోయినా ప్రజాసేవ, సామాజిక ఉద్యమాలు, ప్రజాపోరాటాలు చేస్తూనే ఉంటాను. నిత్యం ప్రజల్లోనే ఉంటాను. నాలాంటివాళ్ళెందరో రాజకీయాల్లోకి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.